మీకు జగనన్న అమ్మ ఒడి డబ్బులు ఇంకా జమ కాలేదా? ఎందుకో వివరాలు తెలుసుకోండి. ఇదివరకే అమ్మఒడి జమ అయిన వాళ్ళు మీరు మీ బయోమెట్రిక్ ని వాలంటీర్లతో అప్డేట్ చేసుకోండి. Jagananna Amma Odi money has not been credited to you yet? Find out why. Those who have already registered Amma Odi, please update your biometric with the volunteers.
మీకు అమ్మ ఒడి అమౌంట్ రూ.13000/- కాకుండా రూ.9,500/- పడిందా అయితే కారణాలు తెలుసుకోండి
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు అక్నౌజ్మెంట్ (Acknowledgment) గురించి డీటెయిల్ గా పేజీ మొత్తం చదివి తెలుసుకోండి.
అమ్మ ఒడి పథకానికి సంబంధించిన పేమెంట్ ఒక నెల జమ చేయడం అయితే జరిగింది.
ఎవరికైనా ఈ ఫస్ట్ పేమెంట్ అనేది ఇంకా జమ కానట్లయితే మీరు మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ని అడిగి ఎందుకు పడలేదు కారణాలు తెలుసుకోవచ్చు ఆ సదుపాయం అయితే అందుబాటులో ఉంది
అక్కడ ఏమి కారణం చూపిస్తుందో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా మీకు మీ సచివాలయంలోనే వివరిస్తారు.
ఈ అమ్మ ఒడి పథకం కింద ఎవరెవరైతే లబ్ధి పొందారు వారందరి దగ్గర కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు.
ఇది లబ్ధిదారులందరూ అనగా ఎవరికైతే అమ్మ ఒడి పథకం డబ్బులు జమ అయినాయో వారందరూ బయోమెట్రిక్ వేయడం తప్పనిసరి.
ఏ సంక్షేమ పథకానికైనా లబ్ధిదారుల నుంచి ఆక్నాలజిమెంట్ కోసం బయోమెట్రిక్ అనగా వాలంటీర్లు మీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.
ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ?
లబ్ధిదారులు మీకు అమ్మ ఒడి పథకం కింద డబ్బులు జమ అయినవి అని రాసి సంతకం పెట్టి ఇవ్వవలసి ఉంటుంది.
తర్వాత వాలంటీర్లు మీ యొక్క బయోమెట్రిక్స్ తీసుకుంటారు.
ఫైనల్ గా మీ వాలంటీర్ మరియు మీ ఫోటోని వాలంటీర్ల యాప్ లో అప్డేట్ చేస్తే అక్కడితో ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.
ఈ ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవును మాకు అమ్మ ఒడి పథకం కింద డబ్బులు జమ అయినవి అని ప్రభుత్వానికి తెలియజేయడానికోసమే ఈ అక్నాలెడ్జ్మెంట్ (acknowledgement) యొక్క ముఖ్య ఉద్దేశం.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply