ఈరోజు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే జగనన్న చేదోడుకు సంబంధించి కొంతమందిలో ఉన్నటువంటి సందేహాలలో
1) వాలంటీర్స్ ఈ పథకానికి అప్లై చేసుకోవాలా వద్దా అని అడుగుతున్నారు
2) అలాగే ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా ? అదేవిధంగా ఇంట్లోనే దుస్తులను ఐరన్ చేసేవాళ్లు అనగా రజకులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. అలాగే ఇంట్లోనే బార్బర్ షాప్ పెట్టుకుని పని చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ గా ఏమైతే చెప్పిందో పూర్తిగా తెలుసుకోండి.
1) వాలంటీర్స్ ఈ పథకానికి అప్లై చేసుకోవాలా వద్దా ?
జగనన్న చేదోడు పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు సంబంధించి. వాళ్లకి సంవత్సరానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం తరఫునుంచి అందిస్తున్నారు దీనినే జగనన్న చేదోడు బతకమని అంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే వాలంటీర్లు ఈ పథకానికి అనర్హులు కాకపోతే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం 5000 రూపాయలు మాత్రమే కాబట్టి బహుశా ప్రభుత్వం వాలంటీర్లకి ఈ సంవత్సరం అప్లై చేసుకునే అవకాశం ఇస్తుందేమో మరి వేచి చూడాలి. వాలంటీర్లు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరందరూ అప్లికేషన్ అలాగే సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకోండి.
2) ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చా ?
ఇంట్లోనే ఉండి పని చేసుకునే వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కొన్నినియమాలు అయితే వర్తిస్తాయి. అదేంటంటే ఎవరైతే ఇంట్లో ఉండి పని చేసుకుంటూ ఉన్నారో వారి కుటుంబం ఈ వృత్తిపైనే ఆధారపడి ఉంది అని నిరూపించగలగాలి అలా నిరూపిస్తే వాళ్లు అర్హులు కిందికి వస్తారు.
జగనన్న చేదోడు సంబంధించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే Toll Free Number ✆ 1902 కి కాల్ చేసి సంప్రదించగలరు
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి దిగువ ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply