Aadhaar Mobile Number link status check-2024
Adhar Card – ఈ పేజీలో మనం ఇప్పుడు క్రొత్తగా వచ్చిన ఆధార్ వెబ్సైట్ నందు Adhar Card కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా తెలుసుకునే విధానాన్ని గురించి తెలుసుకుందాం.
Step 1- ముందుగా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
Step 2 – ఈ పేజీలో ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ ఏది లింక్ అయిందో తెలుసుకోవడానికి చూస్తున్నాము కాబట్టి,దీనికోసం ఎటువంటి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా పేజీ క్రిందకు రావాల్సివుంది. అక్కడ Check Adhar Validity అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
Step 3 – ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి,అదేవిధంగా అక్కడ ఉన్న Captcha ని కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి.ఆ తరువాత Proceed మీద ఎంటర్ చేయాలి.
Step 4 – ఇక్కడ వచ్చిన వివరాలలో చివరగా ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో అని ఫోటో లో చూపించిన విధంగా చివరి 3 అంకెలు కనిపిస్తాయి.
Step 5 – కనుక దీనిని బట్టి మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో అని సులభంగా తెలుసుకోవచ్చు.
మొబైల్ నెంబర్ ని మార్చుకోవాలంటే ఎలా ? (How to change mobile number in Aadhar Card)
మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ కి వెళ్లి సులభంగా మీకు కావాల్సిన మొబైల్ నెంబర్ చెప్పి బయోమెట్రిక్ వేస్తే ఒక్క రోజుల్లోనే లింక్ చేసేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో అయితే మీ గ్రామంలోని కొన్ని సచివాలయాలల్లో పర్మనెంట్ ఆధార్ సెంటర్ లు కూడా తీసుకొచ్చారు.కాబట్టి దగ్గర్లోని పట్టణాలకు పోయే పని లేకుండా మీ ఊర్లోనే చేసుకునే వెసులుబాటు కలదు.
Important Links
Mobile Number Check link – Click Here
Adhar Website Official link – Click Here
Near me Adhar Centre – Click Here
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply