ఈ పేజీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించిన New EHS (Employee Health scheme) కార్డు -2024 డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని చూద్దాం.
ఈ 2024వ సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు అయినటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ,ప్రయివేట్ హాస్పిటల్ లలో చూపించుకోవడానికే ప్రభుత్వం జారీ చేసే కార్డునే EHS (Employee Health scheme) కార్డు అంటారు.
ఈ EHS కార్డ్ ని ఇప్పుడు NTR వైద్య సేవ పేరుతో తీసుకురావడం జరిగింది కనుక ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్ ఈ New EHS (Employee Health scheme) కార్డు ని అప్డేట్ చేసుకుని మీ ఫోన్ లోనే సులభంగా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేకుండానే సులభంగా 7 అంకెల HRMS నెంబర్ ఉంటే చాలు, మీ కార్డు ని సులభంగా మీరే మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును కాబట్టి మీరు ఎక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ,ఏ ఇంటర్నెట్ షాప్ లలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవశ్యం కూడా లేకుండా ఉపయోగించుకోవచ్చును.
New EHS (Employee / Pensioners Health scheme) నమూనా
కనుక నేను ఈ పేజీ క్రింద ఇచ్చిన వెబ్సైటు లింక్ ని ఓపెన్ చేసుకుని నేను చెప్పినట్టు Step By Step ఫాలో అవుతూ చేసుకోండి.
- మొట్టమొదటిగా క్రింద ఇచ్చిన లింక్ ని ఓపెన్ చేసుకున్నట్లయితే మొదటి పేజీ అనేది ఈ విధంగా వస్తుంది
- ఇక్కడ మీ 7 అంకెలు కలిగిన HRMS నెంబర్ (Treasury ID) ని చేసుకోవాలి.
- ఆ HRMS నెంబర్ ఇచ్చాక క్రింద Find Details మీద క్లిక్ చేసుకోవాలి.
- ఆ తరువాత పేజీ లో ఈ క్రింది విధమైన పేజీ ఓపెన్ ఆవుతుంది.
- ఈ పేజీలో Download Health Card అనే ఆప్షన్ మీద click చేసుకోవాలి.
- అక్కడ నుండి మరొక పేజీలో ఆ EHS కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు మరియు వివరాలు చూపిస్తుంది.
- అక్కడ నుండి మీ కుటుంబ సభ్యుల కార్డు ని వేర్వేరుగా కూడ డౌన్లోడ్ చేసుకోచ్చును.
- ఇంగ్లీష్ / తెలుగు ఏ భాషలో కావాలో దానిమీద క్లిక్ చేసుకుని Download చేసుకుని PDF గా ప్రింట్ తీసి లామినేషన్ చేసుకోవచ్చును.
PVC కార్డు – మీకు PVC కార్డు లాగ గట్టిగా కావాలనుకుంటే మీ దగ్గరలోని ఎక్కడైనా ఇంటర్నెట్ షాపుల్లోనో దీనికి సంబంధించి అయితే పివిసి కార్లు చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్లి ఒక హండ్రెడ్ రుపీస్ ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి గట్టి కావాలంటే ప్లాస్టిక్ కార్డు ఇస్తారు
EHS card – DOWNLOAD
ఈ EHS కార్డు పైన ఏ హాస్పిటల్స్ చూస్తారు ?
Hospitals List – Click here
Leave a Reply