హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ గురించి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ఫ్యామిలీ మెంబర్ అంటే మేము ఫలానా కుటుంబానికి చెందిన వాళ్ళము అని లీగల్ గా తెలిపే పత్రమే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్.
మరి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎందుకు ? దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కావాలంటే ఏమి చేయాలి? ఎక్కడ పొందాలి? ఎంత ఫీజు అవుతుంది? ఎన్ని రోజులకు వస్తుంది? ఇలాంటి అన్ని క్వశ్చన్లకి సమాధానాలు తెలుసుకుందాం.
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ యొక్క ఉపయోగాలు.
ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న పొలాలు, ఇల్లు, స్థలం, అలాగే వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డబ్బులు, ఇలా మొదలైన వారి పేరు మీద ఉన్న ప్రతి దాన్ని పొందాలంటే కుటుంబ సభ్యులకు ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అవసరమవుతుంది.
ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కావాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం
కావలసిన డాక్యుమెంట్లు
- చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్
- అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
ఈ డాక్యుమెంట్లు తీసుకొని మొదటగా లాయర్ దగ్గరికి వెళితే, అక్కడ లాయర్ ఒక నోటరీ తయారు చేసి ఇస్తాడు.
ఈ లాయర్ నోటరీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్స్ మరియు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ తీసుకుని మీసేవ లేదా సచివాలయం దగ్గరకు వెళ్లి అక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని అప్లికేషన్ ని ఫిల్ చేసి, అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ ఫీజు రూ 50 రూపాయలు చెల్లిస్తే
వాళ్ళు మీకు అప్లై చేసినట్టు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు.
ఈ రిసిప్ట్ ని అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డుల తో పాటు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ ని తీసుకొని మీ V.R.O. గారికి ఇస్తే,
వాళ్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి బ్యాక్ గ్రౌండ్ ఎంక్వయిరీ చేసుకొని ఏడు రోజుల లోపు మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇస్తారు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply