మీ CFMS ID నంబర్ ను తెలుసుకోవడం ఎలా?
మొదటి పద్దతి ::
మన వెబ్ బ్రౌజర్ లో https://cfms.ap.gov.in/ అనే లింకును ఓపెన్ చేయాలి
Citizen Services అనే మెనూ బార్ లో Expenditure Links అనే Tab పై క్లిక్ చేస్తే సబ్ మెనూస్ ఓపెన్ అవుతాయి.
సబ్ మెనూస్ లో Beneficiary Search నే లింకుపై క్లిక్ చేయాలి, ఇప్పుడు Beneficiary Search Tab ఓపెన్ అవుతుంది.
Beneficiary Search లో Search By PAN Number, Search By Aadhar Number, Search By Bank Account Number, Search By Name, Search By Beneficiary No, Search By Request Number వీటిలో మనము ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాలి.
ఉదాహరణకు Beneficiary Search లో మీరు Search By Aadhar Number ను సెలెక్ట్ చేసుకుంటే మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేయాలి.
మనకు ఒక Dialog Box వస్తుంది Welcome!! You are searching for employee details in CFMS 1423XXXX . The display of employee personal details are restricted in CFMS.
రెండవ పద్దతి ::
CFMS Main Page లో Employee Services అనే లింకు పై క్లిక్ చేయాలి.
Know Your CFMS Login ID అని వస్తుంది ఈ లింకుపై క్లిక్ చేయాలి.
Search CFMS ID పేజి ఓపెన్ అవుతుంది.దీనిలో “Enter Old HRMS Employee code” ( 7digits) : అంటే మన Treasury Code ను ఇక్కడ ఎంటర్ చేయాలి. Treasury Code : 09XXXXX ఎంటర్ చేసి Search బటన్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ ఎడమవైపున మీ HRMS ID, అలాగే కుడివైపున మీ CFMS Login ID కనిపిస్తుంది.
ఈ విధంగా మీ CFMS ID నంబర్ ను తెలుసుకోవచ్చును.
Link – Click Here
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply