2 Good News for Ration Card Holders (రేషన్ కార్డులు ఉన్నవారికి 2 శుభవార్తలు) :
రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డు కలిగిన లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఇందులో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీ నుండి పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీ విషయానికి వచ్చినట్లయితే,
ఇప్పటివరకు రేషన్ సరుకుల పంపిణీని ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు పంపిణీ చేస్తూ ఉండగా, తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇకమీదట ఒకటో తేదీ నుండి 17వ తేదీ వరకు అంటే రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.
ఇక మీదట ప్రతి నెల 17వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరా అధికారులు తెలియజేయడం జరిగింది.
అలాగే ఈ మధ్యకాలంలో రేషన్ సరుకులు పంపిణీకి సంబంధించిన వాహనాలు ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేయడం లేదని అధిక మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నవి.
దీనికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.
ఎవరైనా సరే రేషన్ సరుకులు పంపిణీ దారులు ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ సరుకుల పంపిణీ చేయకపోతే 1967 మీ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేసినట్లయితే వారి మీద తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
రేషన్ సరుకులు పంపిణీ చేసే సమయంలో సదరు కుటుంబ యజమాని అవసరం అనేది లేకుండా కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ వేసుకోవచ్చు అని పలుచోట్ల కొంతమందికి ఈ యొక్క విషయం తెలియక కుటుంబ యజమాని వచ్చేంతవరకు వెయిట్ చేసినట్లయితే గుర్తించడం జరిగింది.
అలా కాకుండా కుటుంబంలో ఎవరైనా సరే బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ సరుకులు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నది.
ఇకపోతే కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరైతే గత ఆరు నెలలుగా రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో, అటువంటి వారికి సంబంధించి లక్ష అరవై వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు విడుదల చేయడం జరిగింది.
ఇందులో కొత్త రేషన్ కార్డులు కన్నా స్లీపింగ్ రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది.
కొత్తగా రేషన్ కార్డు ఎవరికైతే మంజూరు చేయబడిందో, మీరు మీ బయోమెట్రిక్ వేసి రేషన్ ని తీసుకోవచ్చని తెలియజేశారు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply