APRationCard

  • Help
    • Ration Shops List 1
    • Ration Shops List 2
    • Ration Shops List 3
  • News
    • Media
    • Bharatgas
    • Indane Gas
    • HP Gas
    • Home
    • Elections
    • Rules
    • Passport
    • Birth Certificate
    • ATM Card
    • APSRTC
  • Aadhar Card
    • Revenue
    • epos
    • PAN Card
  • Ration Card
    • Ration Shop
    • Spandana
    • Mandal
    • District
    • Helpline
  • Contact us
You are here: Home / Archives for Jobs

AP Grama Sachivalayam 14523 Jobs Recruitment 2023 | Notification Release Soon

February 8, 2023 by admin Leave a Comment

AP Grama Sachivalayam Jobs : వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది.

AP-Grama-Sachivalayam-Recruitment-2023

ప్రధానాంశాలు :

  • ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్‌ 2023
  • 14,523 పోస్టుల భర్తీ యోచన
  • ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్‌..!

AP Sachivalayam Notification 2023 : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి.. ఏప్రిల్‌లోపే ఖాళీల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు పూర్తిచేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్‌ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది. మొత్తం 3 నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చి పోస్టులను భర్తీచేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే..

మొత్తం ఖాళీలు : 14,523

గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి : 182

డిజిటల్ అసిస్టెంట్ : 736

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ : 578

విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ : 467

హార్టికల్చర్ అసిస్టెంట్ : 1,005

సెరికల్చర్ అసిస్టెంట్ : 23

పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ : 4,765

ఫిషరీస్ అసిస్టెంట్ : 60

ఇంజినీరింగ్ అసిస్టెంట్ : 982

వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ : 112

విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ : 990

వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ : 170

వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ : 197

వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ : 153

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ : 371

వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ : 436

వార్డు ఎమినిటీస్ సెక్రటరీ : 459

ఏఎన్‌ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ : 618

ఉమెన్ పోలీస్/ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ : 1092

ఎనర్టీ అసిస్టెంట్ : 1127


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Jobs

Search List 1

Search List 2

Search List 3

How to Search Ration Card Number by Name

District Wise Ration Card Search

 Anantapur

Chittoor

East Godavari

Guntur

Kadapa

Krishna

Kurnool

Nellore

Prakasam

Srikakulam

Visakhapatnam

Vizianagaram

West Godavari

Recent Posts

  • Amalapuram Municipality Details
  • Tanuku Municipality Details
  • Chittoor Municipality Details
  • Palamaner Municipality Details
  • Nandikotkur Municipality Details

Recent Comments

  • tejas on Ration Card Fees – New, Renewal, Editing Fees
  • Kotameharprasad on KRISHNA (District) – Sub Registrar Offices Address & Contact Details
  • admin on How To Check AP HouseHold Mapping List (or) Status Online | హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్
  • Arigela Dinesh Chandranath on How To Check AP HouseHold Mapping List (or) Status Online | హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్
  • Narendra kumar on VISAKHAPATNAM – Dist. BHARAT GAS AGENCIES Contact Details | Address | Online Booking
  • కురువ వెంకటేష్ on AP Revenue Department – Details for Grievance Redress Mechanism
  • Omkaram Purushothama raju on AP Seva Portal (vswsonline) Ration Card Status Find Online
  • Omkaram Purushothama raju on AP Seva Portal (vswsonline) Ration Card Status Find Online
  • Omkaram Purushothama raju on AP Seva Portal (vswsonline) Ration Card Status Find Online
  • Omkaram Purushothama raju on AP Seva Portal (vswsonline) Ration Card Status Find Online

Pages

  • About US
  • Apply for New Ration Card Andhra Pradesh | Download Ration Card Online | Status Check
  • Contact us
  • Privacy Policy

Copyright © 2021 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress .