AP Grama Sachivalayam Jobs : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది.
ప్రధానాంశాలు :
- ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్ 2023
- 14,523 పోస్టుల భర్తీ యోచన
- ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు వెలువడే ఛాన్స్..!
AP Sachivalayam Notification 2023 : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి.. ఏప్రిల్‌లోపే ఖాళీల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు పూర్తిచేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.
ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది. మొత్తం 3 నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీచేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే..
మొత్తం ఖాళీలు : 14,523
గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి : 182
డిజిటల్ అసిస్టెంట్ : 736
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ : 578
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ : 467
హార్టికల్చర్ అసిస్టెంట్ : 1,005
సెరికల్చర్ అసిస్టెంట్ : 23
పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ : 4,765
ఫిషరీస్ అసిస్టెంట్ : 60
ఇంజినీరింగ్ అసిస్టెంట్ : 982
వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ : 112
విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ : 990
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ : 170
వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ : 197
వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ : 153
వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ : 371
వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ : 436
వార్డు ఎమినిటీస్ సెక్రటరీ : 459
ఏఎన్‌ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ : 618
ఉమెన్ పోలీస్/ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ : 1092
ఎనర్టీ అసిస్టెంట్ : 1127
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
I want vro post
My wife Qualification is intermediate passed out and age is 38 years . Could we apply and eligible for which type of post and teleated job portal link with procedure.
My name: Dhanunjaya, Contact No 09840331648