గ్రామ వాలంటీర్ మొబైల్ యాప్ లో క్రొత్తగా వచ్చిన ఆరోగ్య శ్రీ ఆప్షన్ లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు,అదేవిధంగా వాటిని ఎలా యాప్ లో వివరాలు సబ్మిట్ చేయాలి అనే అంశాలను సులభంగా అర్ధం అయ్యేటట్టు చెప్పబోతున్నాము.
New Option In Volunteer App
ముందుగా గ్రామ/వార్డ్ వాలంటీర్ కి సంబంధించిన మొబైల్ యాప్ క్రొత్తగా 7.1.0 గా అప్డేట్ అయింది.కావున ఈ క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు.
APP Link – Download
Step 1 – పై యాప్ ఓపెన్ చేయగానే అక్కడ వాలంటీర్ యొక్క CFMS ID ద్వారా లాగిన్ చేసుకోవాలి.
Step 2 – ఆరోగ్య శ్రీ అనే ఆప్షన్ చివరగా కనిపిస్తుంది.
Step 3 – ఆ ఆప్షన నందు క్రొత్తగా 2 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
1) Acknowledgement Of Beneficiaries
2) EKYC For Photos Missing Beneficiary
1) Acknowledgement Of Beneficiaries ఈ ఆప్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్రొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూవుంది.కావున వాలంటీర్ ఆ కార్డులను వారి కుటుంబానికి అందిచేటప్పుడు ఈ ఆప్షన్ ని ఎంచుకుని ఆ కుటుంబ సభ్యులలో ఒకరి దగ్గర Authentication తీసుకుని కార్డు ని డెలివరీ చేయాలి.
2) EKYC For Photos Missing Beneficiary – ఈ ఆప్షన్ ఎందుకంటే ఇంకా చాలా కుటుంబాలకు క్రొత్త ఆరోగ్య శ్రీ కార్డు లు ప్రింట్ అయి రాని కారణంగా ఈ ఆప్షన్ ని ఇవ్వడం జరిగింది.కనుక వాలంటీర్ ఇంకా ఎవరికీ కార్డు రాలేదో దానికి ప్రధాన కారణం ఆ కుటుంభం యజమాని HOF ఫోటో లేనందున ప్రింటింగ్ వేయటం జరగలేదు,కాబట్టి ఈ ఆప్టిన్ నందు ఈ క్రింది చెప్పిన విధంగా చేసుకోవాల్సి వస్తుంది.
ముందుగా ఈ E-KYC For Photos Missing Beneficiary ని క్లిక్ చేసుకుంటే ఈ క్రింది విధంగా చూపిస్తుంది.అక్కడ ఆ కుటుంబ సభ్యులలో ఎవరిదైనా ఆదార్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ కుటుంబంలోని ఫామిలీ హెడ్ ekyc చేసుకోవడానికి అందుబాటులో ఉన్నడా అనే ఆప్షన్ ని దగ్గర ఉంటే “అవును” అని సలెక్ట్ చేసుకోవాలి.
పై కుటుంబలో ఫామిలీ హెడ్ దగ్గర బయోమెట్రిక్,ఐరిష్ ,ఫేషియల్,OTP ఇలా దేని ద్వారా అయినాekyc చేసుకునే ఆప్షన్ అవ్వడం జరిగింది.కనుక ప్రతి ఒక్కరు ఈ OTP ఆప్షన్ ద్వారా సులభంగా వివరాలు ఇవ్వవచ్చును.
ఒకేవేళ కుటుంభం పెద్ద అందుబాటులో లేకపోతే ఎలా ?
ఈ కుటుంబలో ఫ్యామిలీ హెడ్ అందుబాటులో లేకపోతే “కాదు” అనే ఆప్షన్ ని ఎంచుకు మిగిలిన కుటుంబసభ్యుల దగ్గర ekyc తీసుకోవాల్సి ఉంటుంది.
Arogya Sri Card Mis Match EKYC Report
ఆరోగ్యశ్రీ కార్డ్ ని డౌన్లోడ్ చేయు విధానము2 రకాలు
1) నవశకం – ఈ ఆప్షన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.కానీ వద్దు,ఎందుకంటే కుటుంబ సభ్యుల వివరాలు కరెక్ట్ గ రావడం లేదు.మరియు కొన్ని కార్డ్స్ డౌన్లోడ్ కూడా కావడం లేదు.
2) గ్రామ వార్డ్ సచివాలయ వెబ్సైట్ – ఈ వెబ్సైటు ద్వారా సులభంగా సిటిజెన్ లాగిన్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు.ఇదే ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఫ్రస్టూర్హం సచివాలయం ప్రజలకు అందిస్తున్న సర్వీసులు అన్నే కూడా ఈ వెబ్సైటు నందే కాబట్టి.
For any queries regarding above topic, please tell us through below comment session.