What is CCRC CARD/ Kalu Card.. Uses Benefits, Where to Apply..
Andhra Pradesh : CCRC CARD/ కౌలు కార్డు అంటే ఏమిటి.. ఉపయోగాలు లాభాలు, ఎక్కడ అప్లై చేయాలి.. అప్లై చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎన్ని రోజులకి వస్తుంది, అప్లికేషన్ ఫీ ఎంత అవుతుంది, ఏ నెలలో అప్లై చేసుకోవాలి, ఎన్ని రోజుల వాలిడేట్ ఉంటుంది, ఓనర్ కి అలాగే కౌలుదారునికి ఏం ఏం ఉపయోగాలు ఉంటాయి, ఇద్దరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం.
ముందు CCRC Card అంటే ఏంటంటే, ఫుల్ ఫాం వచ్చేసి Crop Cultivator Rights Card అనగా మనం ఓనర్ నుండి పొలం కౌలుకి తీసుకుంటుంన్నాం అని ప్రభుత్వం ద్వారా ఇచ్చే సర్టిఫికేట్ లేదా కార్డ్..
ఉపయోగాలు\లాభాలు.
మొదటగా 13500 రూపాయలు ఓనర్ కి మరియు కౌలుదారునికి ఇద్దరికి అకౌంట్ లో పడతాయి. ప్రతి సం, oct లేదా jan వేస్తారు..
ఏదైనా విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే, నష్ట పరిహారం డబ్బులు కౌలు దారునికే వస్తాయి..
ఇంపుట్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది (క్రాప్ డామేజ్) Crop insurance amount వస్తుంది.
పంట రుణము పొందవచ్చు.
పంటను మద్దతు ధరకు అమ్ముకోవాలన్న, సబ్సిడిలో విత్తనాలు, మందులు కావాలన్నా ఈ కార్డు అవసరం అవుతుంది.
ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఉపయోగాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం
ముందుగా డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే
- పొలం యొక్క 1బి లేదా పాస్‌బుక్ (1B or passbook of farm)
- ఓనర్ ఆధార్‌కార్డ్ (Owner Aadhaar Card)
- కౌలుదారుని ఆధార్‌కార్డ్ (Tenant’s Aadhaar Card)
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటొ (Passport size photograph)
- ఒక అగ్రిమెంట్ (An agreement)
- ఒక అప్లికేషన్ ఫాం (An application form)
పిడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్చన్ లో ఇస్తున్నాను కావాలంటే అక్కడికి వెల్లి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇవన్ని తీసుకుని పొలం ఏ ఊరి పరిధిలో వస్తుందో ఆ ఊరి VRO లేదా MRO గారిని కలిసి అప్లై చేయించుకుంటే అప్లై చేసిన 2 రోజుల్లో కార్డ్ వస్తుంది.
ఈ ప్రాసస్ చేసినందుకు ఎటువంటి చార్జ్ చేయరు ప్రీ గానే ఇస్తారు.
ప్రతి సం మే నుండి ఆగస్టు మధ్యలో ఇస్తారు.
మినిమమ్ 3 నుండి 11 నెలలు మాత్రమే వాలిడిటి ఉంటుంది.
మినిమమ్ 1 నుండి ఎన్ని ఎకరాలకైనా కౌలుకు తీసుకోవచ్చు.
ఇందులో ఓనర్ కు మరియు కౌలుదారునికి ఇద్దరికి లాభాలు మాత్రమే ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉండవు.
VRO గారు అప్లై చేసి మీకు CCRC Card ఇస్తారు.
కార్డు ఒకటి శాంపిల్ ఒకటి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు.
ఈ కార్డు తీసుకున్న తర్వాత పైన చెప్పిన ఉపయోగాలు పోందాలంటే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ను ఫాలో అవ్వండి.
ఈ కార్డు తీసుకుని దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలో కలవండి.
ఆ కార్డును వారు అన్లైన్ చేసి మీకు 13500 రైతు భరోసా అమౌంట్ కి అప్లై చేస్తారు. ఈ అమౌంట్ ప్రతి సం అక్టోబర్ లేదా జనవరి లో పడుతుంది.
అలాగే క్రాప్ బుకింగ్ కూడా చేస్తారు.. ఆ కార్డు ప్రకారం..
దాని ద్వారా మీకు ఏదైనా పంట నష్టం జరిగితే ఆ అమౌంట్ మీ బాంకు ఖాతా లో పడుతుంది.
ఓనర్ ఒకవేల దూరంగా ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడించినా సిసిఆర్‌సి కార్డు ఇస్తారు.
ఇంకా కొన్ని రకాల రూల్స్ ఆ సిసిఆర్‌సి కార్డు మీద ప్రింట్ చేయబడి ఉంటాయి.
ఒకసారి మీరు స్క్రీన్ లో చూడవచ్చు.
ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాము.
For any queries regarding above topic, please tell us through below comment session.
shabareesh says
where we can download application form