Hi Friends, Welcome to “APRATIONCARD.COM” Website, in this webpage you may find detailed information Jagananna Chedodu Newly application Process for 2023 Year, Who are eligible for apply for this scheme, Required Documents, Age limit etc information available. Please read full of this page and if any doubts tell us through below comment box.
హాయ్ ఫ్రెండ్స్, “APRATIONCARD.COM” వెబ్‌సైట్‌కి స్వాగతం, ఈ వెబ్‌పేజీలో మీరు 2023 సంవత్సరానికి జగనన్న చేదోడు పథకానికి కొత్తగా దరఖాస్తు ప్రక్రియ, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, కావలసిన డాక్యుమెంట్స్, వయోపరిమితి (Age Limit) ఎంత, మొదలైన సమాచారాన్ని కనుగొనండి. దయచేసి ఈ పేజీని పూర్తిగా చదవండి మరియు ఏవైనా సందేహాలు ఉంటే దిగువ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
గమనిక : మొట్టమొదటగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే కొత్తగా జగనన్న చేదోడు పథకానికి అప్లై చేసుకునే వారికి సమయం చాలా తక్కువగా ఉంది. మీరు వెంటనే ఇలా అప్లై చేసుకోండి పూర్తిగా సమాచారం ఈ వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.
ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు మరియు కావలసిన డాక్యుమెంట్స్
వయస్సు పరిమితి : 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అర్హులు.
వయస్సు ఎలా నిర్ధారిస్తారు : మీ ఆధార్ కార్డు లోని డేట్ అఫ్ బర్త్ ని బేస్ చేసుకుని 31st December 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి లేదా 60 సంవత్సరాల లోపు ఉండాలి.
Caste (కులము) : ఈ పథకం ద్వారా ఎవరెవరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే రజక, టైలర్ , నాయి బ్రాహ్మణ లకు ఈ మూడు రకాల వారికి ఈ పథకం చేకూరుతుంది.
రజకులు : రజకుల లో ప్రదానంగా ప్రధానంగా షాపు ఉన్నవారు అంటే షాపు లేదా ఇంటి వద్ద అయినా సరే లేదా తోపుడు బండి వ్యాపారస్థులు అయినా ఈ పథకానికి అర్హులే కాకపోతే వారి కుటుంబ ఆదాయం ప్రధానంగా వ్యాపారమే అయి ఉండాలి.
టైలర్లు : షాపులు ఉన్న టైలర్ లు (టైలర్ లకి కొంత వెసులుబాటు ఉంది అదేంటంటే షాపు పర్వాలేదు లేదా ఇంటిదగ్గర పని చేసుకుంటున్నా పర్వాలేదు, కానీ కుటుంబం టైలరింగ్ మీద ఆధారపడి ఉంటేనే మరియు టైలర్ల కి సంబంధించి అన్ని కులాల వారు అర్హులే)
నాయి బ్రాహ్మణ : షాపులు ఉన్న నాయి బ్రాహ్మణలు (షాపు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు మాత్రమే ఈ పథకానికి అర్హులు షాప్ ఉన్నా కూడా నాయి బ్రాహ్మణులు కాకపోతే అర్హులు కారు)
గమనిక : ప్రాథమిక వెరిఫికేషన్ లో పై వివరాలు అన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ నిర్ధారించి నిజం అని తేలిన తర్వాతే పథకానికి ఆమోదిస్తారు.
జగనన్న చేదోడు పథకానికి అర్హులు కాని వారు ఎవరు ?
వారికి షాపు ఉండవచ్చు వారికి పై చెప్పిన అన్ని అర్హతలు ఉండి కూడా అనర్హులే, ఒకవేళ వారు ఈ క్రింద జాబితాలో ఏదో ఒక పథకం ఇదివరకే పొందుతూ ఉన్నట్లయితే.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా (YSR Matsyakara Bharosa)
వైఎస్ఆర్ వాహనమిత్ర (YSR Vahanamitra)
వైఎస్ఆర్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham)
వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha)
వైఎస్ఆర్ కాపు నేస్తం (YSR Kapu Nestham)
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham)
కాబట్టి ఎవరైనా నా పైన జాబితా లో ఉన్నా కనీసం ఏదో ఒక పథకం అయినా ఇదివరకే పొంది ఉంటే మీరు జగనన్న చేదోడు కి అప్లై చేసుకోకండి.
గమనిక : ఎవరైనా సరే ఏదైనా పథకానికి అప్లై చేసుకునే ముందు అన్ని ఎలిజిబులిటీస్ ఉన్నాయో లేదో మీకు మీరే ఒకసారి చెక్ చేసుకోవడం తప్పనిసరి
ఇంక మిగతావాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం
అన్ని అర్హతలు ఉన్న వారు మొదట మీరు మీ వాలంటరీ ద్వారా గాని లేదా మీ సచివాలయంలో వెళ్లండి. సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వారిని అడిగితే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు.
జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ క్రింద చూపిన విధంగా ఉంటుంది.
ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలి, తర్వాత
మీ సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ల మొబైల్ యాప్ లో సర్చ్ బై ఆధార్ (Search by Aadhar) అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన హౌస్ ఐడి మీ మొబైల్ నెంబర్ మీ పేరు ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడే మీ దరఖాస్తు నమోదు చేయబడుతుంది.
తర్వాత ప్రాథమిక వెరిఫికేషన్ లో భాగంగా – ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి నిజంగానే మీ జీవనోపాధి మీ వ్యాపారమేన కాదా అని నిర్ధారించుకున్న తర్వాత. అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే మిమ్మల్ని మీ షాపు దగ్గర ఒక ఫోటో తీసుకుంటారు.
ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్లు మీ అప్లికేషన్ ని సబ్మిట్ (Submit) చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది NBM PORTAL లోకి పోతుంది. అక్కడే మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయబడతాయి.
కావున అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఈ ప్రాసెస్ లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగిన లేదా అధికారులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్లయిన మీరు వెంటనే 1902 కి ఫోన్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేసుకోండి.
కావలసిన డాక్యుమెంట్స్
అప్లికేషన్ ఫామ్ (Aplication Form)
ఆధార్ కార్డు (Aadhar Card)
రైస్ కార్డ్ (Rice Card)
ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate) – ఇది జనవరి 2022 తరువాతది అంటే ఏపీ సేవ పోర్టల్ (AP SEVA PORTAL) కి సంబంధించింది అయి ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate) – ఇది జనవరి 2022 తరువాతది అంటే ఏపీ సేవ (AP SEVA PORTAL) పోర్టల్ కి సంబంధించింది అయి ఉండాలి.
లేబర్ సర్టిఫికెట్ (Labour Certificate)
ఆధార్ అప్డేట్ హిస్టరీ (Aadhar History) – ఇది మీకు మీ సచివాలయంలోనే ఫ్రీగా ఇస్తారు (ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మి ఆధార్ కు అనుసంధానమై ఉంటేనే)
బ్యాంక్ అకౌంట్ (Active Bank Account Pass Book Xerox)
Click here to download Jagananna Chedodu final User Manual
జగనన్న చేదోడు పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన చాకలివారు, బార్బర్‌లు మరియు టైలర్‌లకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందించడం లక్ష్యం.
గమనిక : బియ్యం కార్డు (Rice Card) ఉంటెనే – ఏ పథకమైనా (బియ్యం కార్డు లేకపోతె ఏ పథకం లేదు)
District-wise Jagananna Chedodu Scheme Status
జిల్లాల వారీగా జగనన్న చేదోడు లబ్ధి పొందిన వారి సంఖ్య
Name of District : Anantapur
Rajakas/ Dhobi : 9417
Nayee Brahmin : 3851
Tailors : 4279
Name of District : Chittoor
Rajakas/ Dhobi : 3934
Nayee Brahmin : 1992
Tailors : 9565
Name of District : Kurnool
Rajakas/ Dhobi : 8768
Nayee Brahmin : 4108
Tailors : 8863
Name of District : YSR Kadapa
Rajakas/ Dhobi : 7399
Nayee Brahmin : 1980
Tailors : 5739
Name of District : Nellore
Rajakas/ Dhobi : 4902
Nayee Brahmin : 1534
Tailors : 9688
Name of District : Guntur
Rajakas/ Dhobi : 2786
Nayee Brahmin : 3030
Tailors : 11764
Name of District : Krishna
Rajakas/ Dhobi : 4366
Nayee Brahmin : 3116
Tailors : 16656
Name of District : Nellore
Rajakas/ Dhobi : 4902
Nayee Brahmin : 1534
Tailors : 9688
Name of District : Prakasam
Rajakas/ Dhobi : 3351
Nayee Brahmin : 2114
Tailors : 10472
Name of District : East Godavari
Rajakas/ Dhobi : 7773
Nayee Brahmin : 4085
Tailors : 13235
Name of District : West Godavari
Rajakas/ Dhobi : 7214
Nayee Brahmin : 3295
Tailors : 10617
Name of District : Srikakulam
Rajakas/ Dhobi : 7187
Nayee Brahmin : 3355
Tailors : 5184
Name of District : Visakhapatnam
Rajakas/ Dhobi : 6319
Nayee Brahmin : 3414
Tailors : 11195
Name of District : Vizianagaram
Rajakas/ Dhobi : 7187
Nayee Brahmin : 2839
Tailors : 8669
ఏవైనా ప్రశ్నలు (లేదా) సూచనలు (లేదా) సందేహాల కోసం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి
Shankar says
Bro ganna cheadodu 2023 September lo kada edi old news Leda new update bro ,Nina NBM Portola open chestea cheodu option chupinchatleadu bro , plz reply my number is 8553080786 this is my what’s up number plz reply Mee…