జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అని మనకు తెలుసు దీనికి సంబంధించి, సచివాలయంలో వాలంటీర్లకు గాని సచివాలయంలో సిబ్బంది కి గాని “Beneficiary Outreach” అనే మొబైల్ యాప్ v15.0 కొత్త వెర్షన్ రావడం జరిగింది.
ఈ యాప్ లో ఈ JVD – 3rd Quarter కి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అది ఆగస్టు లాస్ట్ లో గాని సెప్టెంబర్ ఫస్ట్ లో గాని రాబోతుంది, తేదీ అనేది ఇంకా ఫైనల్ కాలేదు.
Jagananna Vidyadeevena (2022-23 3rd Quarter)
జగనన్న విద్యా దీవెన 3rd క్వార్టర్ కి సంబంధించి e-KYC కి సంబంధించి ఈ Beneficiary Outreach App లో పేర్లు రావడం అయితే జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైతే JVD 3rd Quarter కి అర్హులో ముందుగా మీరు మీ ఈ కేవైసీ(e-KYC) ని మీ వాలంటీర్ దగ్గర పూర్తి చేసుకోండి.
ఒకవేళ మీరు వేరే ఊరిలో ఉన్నట్లయితే మీరు అక్కడ దగ్గరలోని సచివాలయంలోకి వెళ్లి అక్కడ ఎడ్యుకేషన్ సెక్రటరీ లేదా డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించి మీ ఆధార్ నెంబర్ తో మీరు ఈ జగనన్న విద్యా దీవెన ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply