పీఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఉద్దేశం ప్రకారం చేతి వృత్తులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో, వాళ్లందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం మరియు వారు చేసుకునే వర్క్ లో నైపుణ్యం పెంచడం కోసం, ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా, చేతివృత్తుల వారికి ఎటువంటి ఒక లక్ష నుండి మూడు లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇవ్వబోతున్నారు.
ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి. ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ? దీనికి లోన్ అనేది ఎప్పటి లోపు కట్టుకోవాలి ? పూర్తి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని పీఎం విశ్వకర్మ కౌశల్ సామాన్ యోజన అని కూడా అంటారు. ఈ పథకం అనేది 2023 24 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అనౌన్స్ చేసేటప్పుడు ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని చెబుతూ ఈ పథకాన్ని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ విడతలలో చేసుకుంటూ ఈ పథకాన్ని అయితే కొనసాగిస్తాము అని అన్నారు.
ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అందుకుగాను ఈ పథకం కోసం 13 వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకోవడం కోసం ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మొదలు పెట్టారు.
మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా ఇది ఒక పైలట్ ప్రాజెక్టుగా అయితే పరిగణించబడుతుంది. తర్వాత మొత్తం అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద 254 జిల్లాలో ప్రారంభించారు. కావున ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తిరుపతి నెల్లూరు పశ్చిమగోదావరి జిల్లాలలో మొదలైంది. తర్వాత వారం లేదా పది రోజులకు మిగతా అన్ని జిల్లాల్లో కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది.
ఈ పథకంలో మొదటి విడత కింద 18 రకాల చేతి వృత్తుల వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగతా వారికి తర్వాత విడతలలో అవకాశం అయితే ఇస్తామని అంటూ ఉన్నారు.
ఈ విశ్వ కర్మయోజన పథకాన్ని మొదటి విడతలో భాగంగా ఈ క్రింది సూచించిన 18 రకాల చేతి వృత్తుల వారికీ అవకాశం కల్పించారు.
1) వడ్రంగులు
2) పడవలు తయారు చేసేవాళ్ళు
3) ఆయుధాలు లేదా కవచ తయారీ దారులు
4) కుమ్మరులు
5) సుత్తి / మరేదైనా పరికరాల తయారీ
6) తాళాలు తాయారు చేసేవాళ్ళు
7) కమ్మరులు (eg: కుండలు తయారు చేసేవాళ్ళు )
8) శిల్పులు ( ప్రతిమలు,రాళ్ళపై శిల్పాలు చెక్కేవాళ్ళు లేదా రాళ్లను పడగల గొట్టే వృత్తిలో వున్ననూ)
9) బంగారం పని చేసే వాళ్ళు
10) చెప్పులు తయారీ దారులు మరియు చర్మకారులు
11) తాపీ పని చేసేవాళ్లు
12) గంపలు/చాపలు/చీపురులు తయారు చేసే వాళ్ళు
13) కొబ్బరి నారతో తయారు చేసే వస్తువులు లేదా సంప్రదాయ ఆట బొమ్మలు తయారు చేసేవాళ్ళు
14) క్షురకులు (నాయి బ్రాహ్మణులు )
15) పూల మాలలు తయారీదారులు
16) రజకులు
17) టైలర్లు
18) చేపలు పట్టె వలలను తయారు చేసే వాళ్ళు
4) PM విశ్వ కర్మ పథకం యొక్క అర్హతలు ఏమిటి ?
PM Viswakarma Yojana Scheme Eligibility ?
కనీస వయస్సు రిజిస్ట్రేషన్ చేయు సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
పైన తెలిపిన 18 రకాల వృత్తులలో ఏదైనా ఒక వృత్తి అయినననూ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి.
గత 5 సంవత్సరాలలో PMEGP, PM SVANIDHI, MUDRA వంటి లోన్ లు పొంది ఉండకూడదు.ఒకవేళ గతంలో ఋణము పొంది తరువాత పూర్తిగా చెల్లించి ఉన్నట్లయితే ఈ పథకానికి అర్హులు.
కుటుంభంలో ఒకరు మాత్రమే అర్హులు
అనర్హతలు
ప్రభుత్వ ఉద్యోగులు గానీ వారి బార్యా,పిల్లలు గానీ ఈ పథకానికి అనర్హులు.
ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేయు సమయానికి PMEGP, PMSVANIDHI, MUDRA లాంటి లోన్స్ Active గా ఉండకూడదు.
ఈ PM విశ్వకర్మయోజన పథకానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏమిటి?
Documents Requires For PM Viswakarma yojana Scheme In Telugu
1) హస్తకళ లబ్ధిదారుడు యొక్క జెరాక్స్
2) కుటుంభం సభ్యుల అందరి ఆధార్ కార్డులు జిరాక్సులు
3) బ్యాంక్ పాస్ బుక్
4) అడ్రెస్స్ ప్రూఫ్ (రేషన్ కార్డు / రైస్ కార్డు / కరెంట్ బిల్/ ఓటరు కార్డు / ప్రభుత్వ ఆమోదించిన కార్డ్స్ )
5) మీ ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ (OTP తో చేయాల్సి వుంది కాబట్టి )
6) రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా లబ్ది పొందబోయే వ్యక్తి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది.
7) పాన్ కార్డు (తప్పని సరి కాదు)
5) ఈ Pm Viswakarma పథకం వలన లాభాలు ఏమిటి ?
Benefits Of Pm Viswakarma Yojana Scheme
ఈ పథకం ద్వారా కళాకారులకు వారి వృత్తి మీద నైపుణ్యత ఇంకా బాగా వచ్చే విధముగా శిక్షణ ఇస్తారు.
శిక్షణ తీసుకున్న వారికీ PM విశ్వకర్మ సర్టిఫికెట్ మరియు ID కార్డు లను ఇస్తారు.
ఈ శిక్షణ కూడా 2 దఫాలుగా ఉంటుంది.మొదటి దఫాలు ప్రాథమిక శిక్షణ క్రింద 5 నుండి 7 రోజులు (గరిష్టంగా 40 గంటలు) ఇస్తారు.మరియు Advanced Training క్రింద మరో 15 రోజులు మార్కెటింగ్ ( గరిష్టంగా120 గంటలు) మరియు అమ్మకాలపై ఉచిత ట్రైనింగ్ ఇస్తారు.
ఈ ఉచిత ట్రైనింగ్ లో హస్త కళాకారులకు సర్టిఫికెట్ తో పాటు రోజుకి రూ 500 ను శిక్షణ కాలంలో వసతి,భోజనం తోపాటు స్టైఫండ్ రూపంలో ఇవ్వనున్నారు.
అలాగే శిక్షణ పూర్తి అవగానే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా అధునూతన పరికరాలు ఏవైనా కొనుగోలు చేసుకోవడానికి రూ 15,000 లను ఆర్థికసాయం చేయనున్నారు.
వారి యొక్క వృత్తి కి తోడ్పాటుగా ఉండటం కొరకు శిక్షణ పూర్తి అయినా తర్వాత మొదటి విడతగా1 లక్ష రూపాయలు మరియు రెండవ విడత క్రింద మరో 2 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాన్ని మంజూరు చేయనున్నారు.
డిజిటల్ చెల్లింపులు చేసేవారికి రూ100 లకు 1 రూపాయి వచ్చేవిధంగా గరిష్టంగా నెలకు 100 transactions కి ఇది వర్తించేటట్టు ప్రోత్సహిస్తున్నారు.
లోన్ చెల్లింపు విధానము మరియు వడ్డీ లెక్కింపు విధానము
PM Viswa karma Loan And Interest
1లక్ష రుణాన్ని 18 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది.
2 లక్షల రుణాన్ని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది.
5% వడ్డీ రేటు తో సబ్సిడీ గా ఇవ్వనున్నారు.
PM విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేయు విధానము ఎలా?
How to apply PM Viswakarma Yojana scheme
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి Sep -17వ తేదీ నుండి Online లో అవకాశం ఇచ్చారు.కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క హస్త కళాకారుడు సద్వినియోగం చేసుకోవలెను.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు అయితే మాత్రం మీ దగ్గర్లోని సచివాలయంలోకి వెళ్లి వెల్ఫేర్ సెక్రటరీని సంప్రదించాలి.వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా CSC లాగిన్ లో ఉచితంగా దరఖాస్తు చేసి ఇస్తారు.
తెలంగాణా కి చెందిన వాళ్ళు ఉంటే మాత్రం దగ్గరలోని CSC సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలెను.
PM Viswa karmaYojana CSC లాగిన్ – Click Here
6) దగ్గర్లోని CSC సెంటర్ ని తెలుసుకునే లింక్ – Click Here
గమనిక: సిటిజెన్ లాగిన్ ప్రస్తుతానికి ఓపెన్ చేస్తుంటే CSC లాగిన్ లో వెళ్లి చేసుకోండి అని చూపిస్తుంది.
7) HELP LINE NUMBERS
ఈ పథకానికి సంబంధించి మీ రాష్ట్రాలలో ఏమైనా సమస్యలు మరియు సందేహాలు ఉన్నచో అధికారికంగా ఇచ్చిన రాష్ట్రాల వారీగా నోడల్ ఆఫీసర్స్ యొక్క నంబర్స్ ని సంప్రదించవచ్చును.
P. Sharda Mahila says
P Sharda mahila Adhikari doctor JCB free loan Ritu Shyam Narendra Modi sir please free varada Shyam.sbi.32759102526.9603467962 🚜🚜🙏🙏🙏🙏🙏🙏