ఈ 25-01-2024 నాటి ఈ పేజీలోని ముఖ్య సమాచారం
Ysr చేయూత ekyc – ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి చివర విడతగా మహిళలకి వైస్సార్ చేయూత (Rs.18,750/-) అనేది వేయడం జరుగుతుంది.కనుక దీనికి సంబంధించిన విషయాలను కొంచెం వివరంగా చెప్పుకుందాం.
ఈ వైస్సార్ చేయూత కి సంబంధించిన లబ్ధిదారులకు ekyc చేయడానికి పేర్లు వచ్చాయి.కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ వాలంటీర్ దగ్గర లేదా సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర ekyc చేయించుకోవాలి.
దీనికి సంబంధించిన మొబైల్ యాప్
Citizen beneficiary Outreach 18.8 Version
గమనిక – ఇప్పటికే వాలంటీర్ మొబైల్ లో ఉన్న యాప్ ని uninstall చేసిన తరువాత పైన ఇచ్చిన యాప్ ని install చేసుకోవాలి. లేదంటే డైరెక్ట్ గా update చేస్తే కావటం లేదు.
వైస్సార్ చేయూత అర్హుల జాబితా వచ్చిందా..?
ఈ సంవత్సరం కి సంబంధించి సచివాలయంలో ప్రాథమిక అర్హుల జాబితా మరియు అనర్హులు జాబితా రెండూ కూడా రావడం జరిగింది.
అందులో ఎవరైనా అర్హత ఉండి, అనర్హత జాబితాలో పేర్లు వచ్చి ఉంటే సచివాలయంలో గ్రీవెన్సు పెట్టుకోవాలి.
వైస్సార్ చేయూత డబ్బులు ఎప్పుడు పడతాయి..?
ఈ ఆర్ధిక సంవత్సరంకి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పిన సమాచారం ప్రకారం చూస్తే ఫిబ్రవరి 5 వతెదే మొదలై ఒక సంబరాలు లాగా ప్రతి గ్రామంలో చేసుకుంటూ 14 వతెదే వరకు అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు.
లబ్ధిదారులకు Ekyc చేయు విధానము
1) పైన ఇచ్చిన యాప్ లో వాలంటీర్ లేదా సచివాలయ వెల్ఫేర్ సెక్రెటర్ లాగిన్ అవుతారు
2) అక్కడ ysr చేయూత అనే ఆప్షన్ రావడం జరుగుతుంది.
3) పై ఆప్షన్ ఓపెన్ చేసాక ఇక్కడ మార్క్ చేసిన విధంగా ekyc ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి.
4) మరొక్క ఆప్షన్ నందు Beneficiary Details వస్తాయి.
5) పై ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాక సచివాలయ కోడ్ మరియు వాలంటీర్ యొక్క క్లస్టర్ ఎంచుకున్నాక ఆ వాలంటీర్ కి సంబంధించిన లబ్ధిదారుల జాబితా వస్తుంది.
6) అక్కడ ఈ వైస్సార్ చేయూత లో ఆ మహిలా లబ్ధిదారుల తో పాటు వాలంటీర్ లేదా సచివాలయ సిబ్బంది ఫోటో తీసుకుని ఆమె దగ్గర బయోమెట్రిక్ వేసుకోవాలి.
ఇక్కడ లబ్ధిదారులకి బయోమెట్రిక్, Irish, Face అనే మూడు రకాల ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply