Election Commission Reportedly Given Reference Date Of Polling In Andhra Pradesh As April 16
https://youtu.be/9_pxiyscFH8
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారుల మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై అధికారులతో పలు సమీక్షలు నిర్వహించింది. రాజకీయపార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. మిగతా రాష్ట్రలతో పోలిస్తే ఏపీలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఉండటంతో ఈసీ కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేతేదీని సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (అసెంబ్లీ మరియు పార్లమెంట్) పోలింగ్ తేదీగా ఏప్రిల్ 16ను డేట్ ఆఫ్ రిఫరెన్స్ గా తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నోట్ పంపింది. ఇందులో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ తేదీని రిఫరెన్స్ గా పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఈసీ సూచించింది. దీంతో ఇప్పుడు అధికారులు ఏప్రిల్ 16వ తేదీని టార్గెట్ గా పెట్టుకుని పనిచేయనున్నారు.
ఏప్రిల్ 16వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించేందుకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకే ఏప్రిల్ 16వ తేదీని హద్దుగా పెట్టుకుని పని చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక ఈ సర్క్కులర్ చూసిన చాలా మంది మీడియా ప్రతినిధులు ఎన్నికల తేదీ గురించి ఆరా తీయడంతో ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది.ఈ తేదీని కేవలం రిఫరెన్స్‌గా తీసుకుని ఎన్నికల కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని మాత్రమే సూచించినట్లు పేర్కొంది. అయితే సర్క్యులర్‌లో ఉన్నట్లుగా ఏప్రిల్ 16 ఎన్నికల తేదీ కాదని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
Preparations for the general elections are going on in AP. The Central Election Commission, which has already toured the state, conducted several reviews with officials on changes in officials, revision of voter list and other issues. Also learned the views of political parties. Compared to other states, the EC is focusing a little more on the fact that there is a situation where the elections have to be held in AP. As part of this, it seems that the date of elections in the state has been finalized in principle.
The Central Election Commission has sent a note to the officials to take April 16 as the reference date for the general elections (Assembly and Parliament) in AP. In this, the EC has advised the officials to make arrangements by keeping this date as a reference as part of the preparations for the Lok Sabha and assembly elections of many states. With this, the officials will now work with April 16 as the target.
It seems that EC is planning to start general elections across the country on 16th April. As a part of this, the field is being prepared for the conduct of elections in AP in the first phase itself. That is why it has issued an order to the officials to work with April 16 as the deadline. The schedule for the April general elections is likely to be released in late February or first week of March.
After seeing this circular, many media representatives inquired about the date of the election, and the Delhi State Election Commission gave a clarification. However, as per the circular, April 16 is not the date of the election and posted to this effect.
For any queries regarding above topic, tell us through below comment session.
Leave a Reply