ఏపీ సేవ పోర్టల్ కి సంబంధించి ఇప్పుడు మనము గతంలో మాకు షాపు ఉందని ఒక ఎస్టాబ్లిష్డ్ సర్టిఫికెట్ అయితే తెచ్చుకొని ఉంటాం. ఆ సర్టిఫికెట్ పెట్టి జగనన్న చేదోడుకి అప్లై చేసుకుని ఉంటారు లేదా కొత్తగా అప్లై చేసే వారు కూడా తప్పనిసరిగా ఈ సర్టిఫికెట్ అయితే ఉండాలి. లేదా గతంలో అప్లై చేసిన వారు రెన్యువల్ చేసుకోమన్నా కూడా చేసుకోవాలి.
AP లేబర్ డిపార్ట్‌మెంట్. ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పునరుద్ధరణ / new apply ప్రక్రియ
Government of Andhra Pradesh Labour Department
Certificate of Registration of Establishment Sec2(d) and 4(2)
The Andhra Pradesh (Issuance of Integrated Registration and Furnishing of Combined returns under various Labour Laws by certain Establishment) Act-2015
ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కు సంబంధించి సచివాలయం యొక్క డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో షాప్ ఎస్టాబ్లిస్ట్ సర్టిఫికెట్ కోసం కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది లేదా ఇదివరకే సర్టిఫికెట్ ఉండి ఎక్స్పైర్ అయి ఉన్న మీరు రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎవరైనా ఈ సర్టిఫికెట్ కి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంది కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునేవారు మీ ఆధార్ కార్డ్ మరియు ఫోటో ని తీసుకొని వెళ్ళండి.
ఈ సర్టిఫికెట్ కోసం కొత్తగా అప్లై చేసుకునే వారికి 140 రూపాయలు ఫీజు తీసుకుంటారు.
అలాగే ఈ సర్టిఫికెట్ ను రెన్యువల్ చేయాలంటే 340 ఫీజు తీసుకుంటారు రెన్యువల్ చేసుకున్న వారికి మూడు సంవత్సరాలయితే వ్యాలిడిటీ ఉంటుంది.
కొత్తగా ఈ సర్టిఫికెట్లు తీసుకునే వారికి మాత్రం ఒక సంవత్సరమే వ్యాలిడిటీ ఉంటుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి దిగువ ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply