ఈ పేజీలో మనము ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కి సంబంధించిన క్రొత్తగా తుది ఓటరు జాబితాని సులభంగా ఎటువంటి లాగిన్ లేకుండా మన గ్రామం యొక్కలిస్ట్, లేదా పట్టణం లోని వార్డుల లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో మన పేరు ఉందా..లేదా అని చెక్ చెసుకోవచ్చును.
ఆంద్రప్రదేశ్ లో 2024 కి సంబంధించిన తుది ఓటర్ల జాబితాని రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా గారు విడుదల చేశారు.
- 2019 తో పోలిస్తే 15 లక్షలు పెరిగిన ఓటర్లు
- రాష్ట్రంలో మొత్తం ఓటర్లు -4,08,07,256
- పురుష ఓటర్లు – 4,08,07,256
- మహిళా ఓటర్లు – 2,07,29,452
- థర్డ్ జెండర్ ఓటర్లు – 3,482
- అత్యధికంగా కర్నూల్ జిల్లా – 20,16,000 ఓటర్లు
- అత్యల్పంగా అల్లూరి జిల్లా – 7,61,000 ఓటర్లు
80 ఏళ్ళు నిండిన వారు మరియు దివ్యాoగులు,కోవిడ్ బాధితులకు ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం
క్రొత్త ఓటు నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు కూడా నమోదు చేసుకునే అవకాశం కలదు.
తుది జాబితాలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే జనవరి 23 వ తేదీ నుండి CEO కార్యాలయంలో అవకాశం కల్పించనున్నారు.
ఓటరు లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని చెక్ చేసుకునే విధానము
1) పేరు ద్వారా
2) ఓటరు కార్డ్ నెంబర్ ద్వారా
3) మొబైల్ నెంబర్ ద్వారా
Mobile App link – Click Here
గ్రామం / వార్డు మొత్తానికి సంబంధించిన ఓటరు జాబితా మొత్తం డౌన్లోడ్ చేసుకునే విధానము
Website Link – CLICK HERE
STEP 1– ఇక్కడ పై లింక్ ఓపెన్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మొబైల్ లో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
STEP 2 – ఇక్కడ PDF Electrol Roll ఆప్షన్ నందు Assembly Constituency ని క్లిక్ చేయాలి.అక్కడే final SSR E roll – 2024 అనే దానిపై క్లిక్ చేసుకోవాలి.
STEP 3 – ఈ ఆప్షన్ నందు రాష్ట్రం,జిల్లా,నియోజకవర్గం ఎంచుకుని ఆ తరువాత ఓటర్ లిస్ట్ ఏ భాషలో కావాలో ఎంచుకుని, అక్కడే CAPTCHA ని ఎంటర్ చేసుకోవాలి.
STEP 4 – ఇక్కడ కొంచెం క్రిందకు వస్తే ఈ ఫోటో లో ఉన్నట్టు ఆప్షన్ వస్తుంది.అక్కడ మీ గ్రామం పేరు లేదా మీ వార్డ్ ని ఎంచుకోవాలి. లేదంటే PART NUMBER ద్వారా కూడా లిస్ట్ ని డౌన్లోడ్ చెసుకోవచ్చు.
ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము
- 1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
- 2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
- 3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము
- 4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?
ఓటరు కార్డ్: దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ రకమైన అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అది ఏమిటంటే గత రెండు,మూడు సంవత్సరాలుగా ఓటరు కార్డ్ కొరకు క్రొతగా దరఖాస్తు చేసుకున్నవారు,ఏదైనా వివరాలు మార్చుకున్న వారు ఉన్నా మరీ ముఖ్యంగా ఓటరు కార్డ్ ఏ కారణం చేతనైనా పోగొట్టుకుని ఉన్నవారికి మరలా ఓటరు కార్డ్ పొందాలంటే డౌన్లడ్ ఆప్షన్ లేకుండా అయిపోయింది.కావున ప్రజలందరూ ఈ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.బహుశా అందరూ ఎదురు చూస్తున్నట్టు గానే ఈ డౌన్లోడ్ ఆప్షన్ రానే వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.
1) ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎవరికి అవకాశం ఉంది ?
జ) ఈ ఓటరు కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇప్పటి వరకు క్రొతగా నమోదు చేసుకున్న వారికి ఉండేది.కానీ ఇప్పుడు క్రొత్త,పాత ఎవరైనా ఓటరు కార్డ్ లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు.
2) ఓటరు కార్డ్ డౌన్లోడ్ కొరకు కావాల్సిన వివరాలు ఏమిటి ?
జ) ఇప్పుడు వచ్చిన క్రొత్త నిబంధనల ప్రకారం ఓటరు కార్డ్ ని సిటిజెన్ డౌన్లోడ్ చేసుకోదలస్తే తప్పకుండా ఓటరు కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది.కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు.
3) ఓటరు కార్డ్ డౌన్లోడ్ చేయు విధానము ఎలా ?
జ) ముందుగా ఈ ఓటరు కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసుకోండి.ఈ రకమైన పేజీ ఓపెన్ అవుతుంది.
PAGE 1: మొదట ఈ రకమైన పేజీ ఓపెన్ అయినప్పుడు సిటిజెన్ అక్కడ చూపించే ఏ సర్వీస్ అయిననూ స్వoతంగా చేసుకోదలస్తే ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
గమనిక: అక్కడ లాగిన్ అవ్వాలంటే అంతకుముందుగా ఈ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాల్సిఉంటుంది.ఈ క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన లింక్ ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ మరియు OTP సాయంతో USER NAME అదేవిధంగా PASSWORD ని సెట్ చేసుకోవాలి.
PAGE 2: పైన చెప్పిన విధంగా విజయవంతం గా User Name, Password Create చేసుకున్నాక, దాని సాయంతో లాగిన్ అవ్వాలి.లాగిన్ అయితే ఈ క్రింది చూపించిన ఆప్షన్ లలో epic Card Download అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి వుంటుంది.
PAGE 3: ఇక్కడ ఓటర్ కార్డ్ నెంబర్ కానీ లేదా రెఫరెన్స్ నెంబర్ గానీ ఇచ్చి,దాని క్రింద ఆప్షన్లో మీ రాష్ట్రం ని ఎంచుకుని Search ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె ?
ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ లేకపోతె ఈ క్రింది విధమైన వివరాలు చుపిస్తోంది.దాని అర్థం ఏమిటంటే మీ ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేనందున కార్డ్ డౌన్లోడ్ చేయుటకు వీలుపడదు,అని అర్థం.
మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ క్రింది విధంగా చూపించినట్లు Send Otp పై క్లిక్ చేసి,ఓటరు కార్డ్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చిన OTP ని ఎంటర్ చేసి VERIFY చేయాలి.అంతటితో విజయవంతం గా వెరిఫై చేసుకుని CAPTCHA ని ఎంటర్ చేస్తే DOWNLOAD ఆప్షన్ వస్తుంది.దాని మీద క్లిక్ చేయగా మీకు ఓటరు కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది.
ఈ ఓటరు కార్డ్ PDF లో డౌన్లోడ్ చేసుకుని మాములు గా లామినేషన్ చెసుకోవచ్చు.లేదంటే మార్కెట్లలో అందిచే PVC కార్డ్ ల పై కూడా ప్రింట్ తీసుకుని ఓటరు కార్డ్ ని ఉపయోగించుకోవచ్చును.
4) ఓటరు కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఏమి చేయాలి ?
జ) Offline లో అయితే మీరు చేయాల్సిందల్లా FORM-8 అనేది అప్లికేషన్ నింపి అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేస్తున్నట్టు పెట్టి మీ BLO కి అందచేస్తే దానిని APPROVE చేస్తారు.
PDF APPLICATION: CLICK HERE
ఓటరు కార్డ్ కి సంబంధించిన అధికారిని తెలుసుకోవడం ఎలా ?
How to Find Your Booth Level Officer (BLO)
Booth Level Officer- ఎన్నికల కమీషన్ ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటరు కార్డు కల్పించడడంతో పాటు దాని యొక్క వినియోగాలపై కూడా ఎప్పటికప్పుడూ ఎన్నికల సమయాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వుంటారు.అదే సమయంలో ప్రతి గ్రామానికి/ వార్డుకి సంబంధించి ఒక Booth Level Officer ని నియమిస్తూ వుంటారు.కనుక ఇప్పుడు జులై 21 వ తేదీ నుండి ఆగష్టు 21 వ తేదీ వరకు ఓటరు కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది.కనుక ఈ వెరిఫికేషన్ అయ్యాక జనవరి 5 వ తేదీ ఫైనల్ లిస్ట్ రిలీజు చేస్తారు,కావున ఈ వెరిఫికేషన్ చాలా కీలకం కనుక మీ ఓట్లు లిస్ట్ లో ఉన్నాయా లేదా మీ Booth Level Officerదగ్గర చెక్ చేసుకోండి. ఈ పేజీ నందు మనము ఇప్పుడు ఈ Booth Level Officer ని ఏ విధంగా కనుక్కోవాలి మరియు వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ప్రభుత్వం అధికారిక website లో అందుబాటులో ఉంచింది.కనుక ఈ విషయాలన్నిటిని చాలా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం.
BOOTH LEVEL OFFICER యొక్క విధులు ఏమిటి ?
ఈ BLO లు యొక్క ప్రధాన కర్తవ్యాలు గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం.
18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికీ ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉచితంగా BLO లాగిన్ నందు ఓటు హక్కును నమోదు చేయించాలి.
- ఓటరు కార్డు లో తప్పులు ఏమైనా సరిదిద్దుకోవాంటే కూడా చేస్తారు.
- ఓటరు కార్డు ని ఒక చోట నుండి మరొకచోటికి మార్పు చేయదలచిన చేసి ఇస్తారు
- ఓటరు కార్డు కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తారు.
- ఓటరు కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేస్తారు.
- ఓటరు కార్డు లో అభ్యంతరాలు వుంటే పరిశీలిస్తారు.
- ఓటరు కార్డు పోగొట్టుకుని ఉంటే మరల రీ ప్రింట్ కి దరఖాస్తు చేయిస్తారు.
- చనిపోయిన వారిని ఓటరు లను లిస్ట్ నుండి తొలగిస్తారు.
- ఒకే వ్యక్తికి రెండు,మూడు చోట్ల ఓటరు కార్డు లు ఉంటే పరిశీలన చేసి ఓటరు కోరుకున్న చోట పెట్టి,మిగిలిన చోట తొలగిస్తారు.
- ఓటు హక్కు పై ప్రజలలో అవగాహన పరుస్తారు.
- ఎన్నికల సమయంలో ఓటరు స్లిప్ లను పంచుతారు.
Know Your Booth Level Officer
దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం సులభంగా మీకు కేటాయించిన BLO యొక్క పేరు,మొబైల్ నెంబర్ ను ఎప్పుడూ అధికారిక వెబ్సైటు నందు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.కనుక దానికి ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1) ముందుగా దీనికి సంబంధించిన లింక్ క్రింద ఇవ్వబడుతుంది.కనుక ముందుగా అక్కడ క్లిక్ చేసుకోగలరు.
LINK – CLICK HERE
పై లింక్ ఓపెన్ చేసుకున్నాక ఈ క్రింది విధంగా పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ ఓటరు కార్డు నెంబర్ గానీ లేదా మీ కుటుంబంలో వారిదైనా లేదా మీ గ్రామంలో ఎవరిదైనా అక్కడ ఎంటర్ చేసి దాని క్రింద వున్నా CAPTCHA ని తప్పులు లేకుండా ఎంటర్ చేసిన తరువాత Search బటన్ పై క్లిక్ చేయగానే క్రింది ఫోటో లో చూపించిన విధంగా మీకు సంబంధించిన Booth Level Officer ఎవరు,వారి పేరు,మొబైల్ నెంబర్ మరియు వారితో పాటు వారి పై అధికారి అయినా D.E.O (జిల్లా కలెక్టర్) యొక్క కాంటాక్ట్ వివరాలు కూడా DISPLAY అవుతాయి.కనుక అక్కడ నుండి వారిని కాంటాక్ట్ అయ్యి మీ ఓటరు కార్డు కి వున్న సమస్యలను సరిదిద్దుకోవచ్చును.
అధికారులు సరిగ్గా స్పందిచకపోతే ఎవరికీ చెప్పుకోవాలి?
గ్రౌండ్ స్థాయిలో వున్నా Booth Level Officer సరిగ్గా స్పందిచకపోతే వారి పై స్థాయిలో ఉన్నటువంటి ERO, DEO లకి పై నంబర్లు కి కాల్ చేసి చెప్పుకోవచ్చును.వారికీ సంబంధించి వివరాలను కూడా ఏ విద్మగా తెలుసుకోవాలో పైన వివరించాను, కావున క్షుణ్ణంగా తెలుసుకోగలరు.
TOLL FREE NUMBER – 1800111950
ఈమెయిల్ – complaints@ eci.gov.in
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply